Breaking News

జొమాటోకి గట్టి షాక్‌.. ఆ చార్జీలపైనా జీఎ‍స్టీ కట్టాల్సిందే!

Published on Thu, 12/28/2023 - 11:17

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎ​స్టీ ఇంటెలిజెన్స్‌ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్‌ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది.  ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.

పెనాల్టీలు, వడ్డీ కూడా..
జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది.

జొమాటో స్పందన 
డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్‌ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్‌, ట్యాక్స్‌ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్‌కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమ‍ర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)