Breaking News

Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్‌.. కేవలం రూ. 89 మాత్రమే

Published on Wed, 02/22/2023 - 18:19

ఆర్డర్ చేసిన నిముషాల్లోనే డెలివరీ చేసే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడీస్ కోసం అదిరిపోయే సర్వీస్ తీసుకువచ్చింది. జొమాటో ఎవిరిడే (Zomato Everyday) పేరుతో ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తుంది.

మార్కెట్లో జొమాటో ఎప్పటికప్పుడు తమ ఇన్‌స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగానే ఈ కొత్త సర్వీసుని అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో దీపేంద్ర గోయల్ తెలిపారు. ఈ సర్వీస్ కింద సరసమైన ధరలోనే హోమ్ స్టైల్ ఫుడ్‌ అందిస్తామన్నారు. 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించే సమయంలో ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు.

జొమాటో ఎవిరిడే సర్వీస్ ప్రారంభంలో గురుగావ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫుడ్ పార్ట్‌నర్ హోమ్ చెఫ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ అందిస్తారు. కంపెనీ అందించే ఈ హోమ్ స్టైల్ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89 మాత్రమే.

(ఇదీ చదవండి: ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!)

జొమాటో సంస్థకు ప్రధాన ప్రత్యర్థి గతంలో స్విగ్గీ 2019 లో స్విగ్గీ డెయిలీ పేరుతో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీస్ ప్రారభించింది. అయితే అనుకున్నంత సక్సెస్ సాధిచకపోవడంతో 2020లో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసులను నిలిపేసింది. అయితే ఇప్పుడు జొమాటో అలాంటి సర్వీసుని త్వరలోనే ప్రారంభిస్తుంది.

జొమాటో కంపెనీ తమ కస్టమర్ల కోసం ప్రారంభించే ఈ కొత్త సర్వీస్ ఎంత వరకు సక్సస్ సాధిస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది, అంతే కాకుండా  కంపెనీ డెలివరీ బాయ్స్ కోసం రెస్ట్ రూమ్స్‌ నిర్మిస్తున్నట్లు తెలిపింది. డెలివరీ బాయ్స్ ఈ రూమ్స్‌లో కొంత విశ్రాంతి తీసుకోవచ్చు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు