Breaking News

జీకి భారీ షాక్‌.. ‘సోనీ సంచలన నిర్ణయం!’

Published on Mon, 01/08/2024 - 17:41

ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

జపాన్‌కి చెందిన డైవర్సిఫైడ్‌ దిగ్గజం సోనీ గ్రూప్‌.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్‌ గోయెంక్‌ కారణమని తెలుస్తోంది. 

2021లో ఒప్పందం
2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓగా పునిత్‌ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్‌తో పాటు సోనీ పిక్చర్‌ నెట్‌ వర్క్‌ ఇండియా సీఈఓ ఎన్‌పీసింగ్‌తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. 

సెబీ మధ్యంతర ఉత్వరులు
అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్‌ చంద్ర, సీఈఓ పునీత్‌ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. 

పునీత్‌ గోయెంకాకు సెబీ ఆదేశాలు 
అందులో గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర, ఆయన తనయుడు పునీత్‌ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్‌ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్‌, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది.  

పునిత్‌ నాయకత్వంపై నీలినీడలు
తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న   ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో  సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది.  

విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది.  ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)