Breaking News

ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు

Published on Fri, 06/06/2025 - 14:05

ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మంది యువకుల కల. కానీ సమర్థమైన డబ్బు నిర్వహణ అలవాట్లు కొరవడడంతో సంపాదన మొదలుపెట్టిన ప్రాథమిక దశలోనే యువతకు ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. అయితే సరైన ప్రణాళికతో ఈ ఇబ్బందులను గట్టెకవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. యువత సాధారణంగా ఎలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారో.. దాని నుంచి ఎలా బయటపడవచ్చో కింది ఏడు సమస్యలు-పరిష్కారాల ద్వారా తెలుసుకుందాం.

1. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం

చాలా మంది యువతకు బడ్జెట్, రుణ నిర్వహణ, పెట్టుబడి వంటి ముఖ్యమైన ఆర్థిక నైపుణ్యాలు ఉండవు. అవకాశం ఉన్నా వాటిని నేర్చుకోవాలనే స్పృహ ఉండదు. పాఠశాలలు, కళాశాలల్లోనూ నిజ జీవితంలోని ఆర్థిక పరమైన సమస్యలపై అరుదుగా బోధిస్తారు. దానికితోడు యువత స్థిరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతుంది.

పరిష్కారం: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వివిధ మాధ్యమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి. రిచ్ డాడ్ పూర్‌ డాడ్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి... వంటి చాలా పుస్తకాలు మార్కెట్‌లో ఉన్నాయి. వాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకొని ప్రాథమికంగా అందులోని అంశాలను నేర్చుకోవాలి.

2. అధిక వ్యయం, జీవనశైలి ద్రవ్యోల్బణం

సామాజిక మాధ్యమాలతో లాభాలున్నట్లే నష్టాలున్నాయి. యువత ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్‌ల్లో తోటివారిలాగా తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి బట్టలు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు.. వంటివి కొనుగోలు చేస్తున్నారు. తోటివారి నుంచి ఏర్పడే పరోక్ష ఒత్తిడి ద్వారా శక్తికి మించి ఖర్చు చేయడానికి సోషల్‌ మీడియా అవకాశం కల్పిస్తుంది.

ఉదా: రూ.30,000 సంపాదించే వ్యక్తి సోషల్‌మీడియా ప్రభావం ద్వారా రూ.25,000 ఖర్చు చేసే అవకాశం ఉంది. దాంతో పొదుపునకు పరిమిత అవకాశం ఉంటుంది.

పరిష్కారం: 50/30/20 నియమాన్ని అనుసరించాలి. అంటే అవసరాలకు 50%, కోరికలకు 30%, పొదుపునకు 20% ఖర్చులతో బడ్జెట్‌ రూపొందించుకోవాలి.

3. నియంత్రించలేని రుణం, క్రెడిట్ కార్డు దుర్వినియోగం

క్రెడిట్ కార్డులు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి. కానీ వాటి దుర్వినియోగం అధిక వడ్డీలకు కారణం అవుతుంది. సులభంగా ఉన్నట్లు కనిపించే ‘బై నౌ, పే లేటర్ (బీఎన్‌పీఎల్‌)’ పథకాలు యువతను ఖర్చుల వైపు లాగేస్తున్నాయి. నెలల తరబడి చెల్లించని రూ.50,000 క్రెడిట్ కార్డు బిల్లు అధిక వడ్డీ కారణంగా రూ.70,000 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

పరిష్కారం: ప్రణాళికాబద్ధమైన ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి నెలా బిల్లులను పూర్తిగా చెల్లించాలి. అత్యవసరమైతే తప్ప బీఎన్‌పీఎల్‌కు దూరంగా ఉండాలి.

4. పొదుపు చేయకపోవడం

అత్యవసర నిధి లేకుండా యువకులు వైద్య బిల్లులు, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసర ప్రయాణం వంటి ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూడ్చేందుకు చాలా మంది అప్పులు చేయడం లేదా ఖరీదైన రుణాలు తీసుకోవడం చేస్తుంటారు.

పరిష్కారం: కనీసం 3-6 నెలల సరిపడా ఖర్చులను ప్రత్యేక అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని కొనుగోళ్ల కోసం అప్పుల్లో మునిగిపోవద్దు.

5. ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ లేకపోవడం

చాలా మంది యువత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి సంపదను పెంచే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు డబ్బును పొదుపు ఖాతాలు, ఇతర సాధానాల్లో ఉంచుతారు. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమేణా కాంపౌండింగ్ ప్రయోజనాలు తగ్గుతాయి.

పరిష్కారం: దీర్ఘకాలిక వృద్ధి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ (సిప్) ప్రారంభించాలి. స్టాక్స్, ఈటీఎఫ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులను వైవిధ్యపరచాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్, రిటర్న్‌లపై స్పష్టత ఉండాలి.

6. స్కామ్‌ల బారిన పడడం

వేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువ పెట్టుబడిదారులు తరచుగా పోంజీ పథకాలు(మోసపూరిత స్కీమ్‌లు), క్రిప్టో స్కామ్‌లు, నకిలీ స్టాక్ చిట్కాలకు మొగ్గుచూపుతారు. సరైన పరిశోధన లేకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కోల్పోతున్నారు.

పరిష్కారం: పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లను సరిచూసుకోవాలి. ఆథరైజ్డ్‌ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలి.

ఇదీ చదవండి: జస్ట్‌ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్‌ మాల్యా

7. పన్ను ప్రణాళికలు విస్మరించడం

చాలా మంది ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి పన్ను ఆదా పథకాలను ఉపయోగించకపోవడం వల్ల అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గుతుంది.

పరిష్కారం: పొదుపు, పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సెక్షన్ 80 సీ ఆప్షన్లను ఉపయోగించాలి. పన్నులను కచ్చితంగా సమయానికి దాఖలు చేయాలి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)