Breaking News

ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్‌ బంపరాఫర్‌

Published on Sun, 08/06/2023 - 22:18

‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్‌ (ట్విటర్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్‌ ప్రకటించారు.

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ట్వీట్లు చేసే, లైక్‌ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.  దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. 

ట్విటర్‌ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్‌’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్‌ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్‌ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్‌లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్‌ షేర్‌ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు.

Zuck × Musk fight: ‘జుక్‌ × మస్క్‌’ కుబేరుల కోట్లాట లైవ్‌.. ఆ ఆదాయంతో..

ఇలా మస్క్‌ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్‌ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్‌ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్‌ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)