Breaking News

ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు

Published on Wed, 02/19/2025 - 20:41

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ఏఐ కొత్త వర్షన్‌ 'గ్రోక్‌ 3'(Grok 3)ని లాంచ్ చేసిన తరువాత.. ఎక్స్ (ట్విటర్) ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి.

ఇండియాలో ఇప్పటివరకు.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ. 1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ. 3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ. 18,300 నుంచి రూ. 34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ. 244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ. 650గా ఉన్నాయి.

గ్రోక్ 3
టెస్లా అధినేత మస్క్.. ఎక్స్‌లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో కొత్త జనరేటివ్‌ ఏఐ మోడల్‌ 'గ్రోక్ 3'ను ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని పేర్కొన్నారు. గణితం, సైన్స్,  కోడింగ్‌ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్‌లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)