Breaking News

ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలు

Published on Tue, 12/24/2024 - 17:01

ఇలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్' (Twitter) తన ప్రీమియం ప్లస్ ధరల పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచే ప్రపంచంలోనే చాలా దేశాల్లో ప్రీమియం ప్లస్ ధరలను పెంచిన ఎక్స్.. ఇప్పుడు తాజాగా భారత్‌లోనూ పెంచినట్లు వెల్లడించింది.

ఇప్పటికే ప్రీమియం ప్లస్ (Premium Plus) ప్లాన్ ఎంచుకున్న వారు మినహా.. మిగిలినవారు కొత్త ధరల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యునైటెడ్ స్టేట్స్‌లో.. నెలవారీ ప్రీమియం ప్లస్ రేటు 16 డాలర్ల నుంచి 22 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో వార్షిక చందా కూడా 168 డాలర్ల నుంచి 229 డాలర్లకు చేరింది.

భారత్‌లోనూ ఈ ప్రీమియం ప్లస్ ధరలు రూ. 1,300 నుంచి రూ. 1,750కి పెరిగింది. అంటే ఈ ధరలు 35 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. యాన్యువల్ సబ్‌స్క్రైబర్‌లు కూడా ఇప్పుడు 18,300 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధరల పెరుగుదలకు ముందు.. యాన్యువల్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 13,600 మాత్రమే చెల్లించాల్సి ఉండేది.

పెరిగిన ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ప్రీమియం ప్లస్ ధరలు పెరిగినప్పటికీ.. భారతదేశంలో బేసిక్, స్టాండర్డ్ ప్రీమియం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్లాన్స్ సబ్‌స్క్రైబర్‌లు మునుపటి మాదిరిగానే 243 రూపాయలు, 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియో

ప్రస్తుత సబ్‌స్క్రైబర్‌ల ధరల నిర్మాణాన్ని కూడా ఎక్స్ స్పష్టం చేసింది. మీ తదుపరి బిల్లింగ్ సైకిల్ 20 జనవరి 2025లోపు ప్రారంభమైతే, మీరు పాత ధరనే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తరువాత కొత్త రేటు వర్తిస్తుంది. సర్వీస్‌ల పెంపుదల కారణంగానే ధరల పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు యాడ్-ఫ్రీ బ్రౌజింగ్‌ను పొందవచ్చు. అంతే కాకుండా గ్రోక్ ఏఐ చాట్‌బాట్, రాడార్ వంటి కొత్త ఫీచర్‌లకు యాక్సెస్ చేయవచ్చు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)