Breaking News

మెప్పించలేకపోతున్న ఏఐ.. పరిశోధనలో కీలక విషయాలు

Published on Fri, 08/02/2024 - 07:13

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఎక్కువవుతోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మార్కెటింగ్ రంగం కొంప ముంచుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

ఏఐ అనేది నేడు స్మార్ట్‌ఫోన్‌, గూగుల్, ఇంటర్నెట్‌లలో కనిపించే సాధారణ పదం అయిపోతోంది. యాడ్స్‌ విషయంలో కూడా ఏఐ హవా సాగుతోంది. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచే అవకాశం ఉందని సంస్థలు కూడా భావిస్తున్నాయి. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రకటనలలో ఏఐ ఉపయోగించడం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టంగా వెల్లడించారు.

ఏ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడినా.. అమ్మకాల విషయంలో మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. దీంతో సేల్స్ గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది. జర్నల్ ఆఫ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ ఈ విషయాలను వెల్లడించింది.

ఏఐ క్రియేట్ చేసిన లేబుల్స్ కస్టమర్లను ఎక్కువ ఆకర్శించలేవు. ఏఐ భావోద్వేగాలను తగ్గిస్తుంది. అమ్మకాల్లో ఎమోషన్ చాలా ప్రధానం, ఏఐ అదే విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోతోందని డబ్ల్యూఎస్‍యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసూట్ సిసెక్ వెల్లడించారు.

కంపెనీలు తమ మార్కెటింగ్‌లో ఏఐను ఎలా ప్రదర్శించాలో జాగ్రత్తగా పరిశీలించాలని అధ్యయనం సూచిస్తుంది. మార్కెటర్లు ఫీచర్లు లేదా ప్రయోజనాలను వివరించడంపై దృష్టి పెట్టాలి. ఏఐ బజ్‌వర్డ్‌లను నివారించాలని సిసెక్ సలహా ఇచ్చారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)