Breaking News

భారత్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు: సేల్స్‌ఫోర్స్‌

Published on Fri, 09/20/2024 - 13:53

శాన్‌ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నామని కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్‌ చైర్మన్‌, సీఈవో మార్క్‌ బెనియాఫ్‌ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్‌ చెప్పారు. డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్‌ గ్రూప్‌ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్‌’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్‌ ఈ విషయాలు చెప్పారు.

సేల్స్‌ఫోర్స్‌ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్‌ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)