Breaking News

భారత్‌లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ 'అజయ్ బంగా'.. ప్రముఖులతో సమావేశాలు

Published on Fri, 03/24/2023 - 07:19

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌గా అమెరికా ప్రతిపాదించిన అజయ్‌ బంగా తాజాగా భారత్‌ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో (మార్చి 23, 24) భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ తదితరులతో సమావేశం కానున్నారు. 

భారత్‌ అభివృద్ధి ప్రణాళికలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిపరమైన సవాళ్లు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారని అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన వృత్తి విద్యా కోర్సుల సంస్థల నెట్‌వర్క్‌ ’లెర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌’ను కూడా బంగా సందర్శించనున్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్‌ పాక్షికంగా నిధులు సమకూర్చింది. 

మాస్టర్‌కార్డ్‌ చీఫ్‌గా ఉన్న బంగా పేరును ప్రపంచ బ్యాంక్‌కు కొత్త ప్రెసిడెంట్‌గా  ప్రతిపాదించిన వెంటనే భారత ప్రభుత్వం మద్దతు తెలిపిందని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, బ్రిటన్‌ తదిన్‌దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్లు వివరించింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మూడు వారాలుగా వివిధ దేశాలను సందర్శిస్తున్నారు. ఆఫ్రికాతో ప్రారంభించి యూరప్, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల తర్వాత ఆఖరుగా భారత్‌ వచ్చారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)