Breaking News

మహిళల రికార్డ్‌: వారి టార్గెట్‌ పక్షి కన్నే, గర్వంగా ఉంది: ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు

Published on Sat, 08/05/2023 - 11:48

India wins historic gold medal జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంపై పారిశ్రామివేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. భారతీయ మహిళలు గొప్పగా రాణిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే భారతంలో అర్జునిడిలా వారి టార్గెట్‌ పక్షి కన్ను మాత్రమే..బ్లూఐ కాదు .మీ విజయాన్ని చూసి దేశం గర్వపడుతోంది.  అంటూ ప్రశంసలు కురిపించారు. త ద్వారా భారతీయ మూలాల్లో ఉన్న విలువిద్య ప్రాధాన్యతను, ప్రతిభను కొనియాడారు. 

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది.  ఈ బృందంలో జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్ మరియు అదితి గోపీచంద్ స్వామి ఉన్నారు. చివరి రౌండ్‌లో, డాఫ్నే క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెకెరాలతో కూడిన మెక్సికన్ జట్టుపై అసాధారణమైన ప్రదర్శనను ప్రదర్శించారు. భారత త్రయం 235-229 స్కోరుతో విజయం సాధించారు. దీంతో నెటిజన్లు కూడా మహిళల విజయంపై స్పందిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలుస్తున్నారు అంటూ భారత జట్టును పొగడ్తలు కురిపిస్తున్నారు. 

భారతీయ మహిళల ఘనత మరుగున పడిపోతోంది. ఇంట్లో కుటుంబం కోసం , పొలాల్లో పని చేయడం , కార్యాలయంలో పని ,ఇప్పుడు స్టార్టప్‌లను నడపడం, దేశం కోసం పతకాలు సాధించడంతోపాటు చాలాపనులను విజయవంతంగా చేయగలరు. కానీ కుటుంబ చాకిరీలాగానే చాలా మంది మహిళల  పాత్ర వెలుగులోకి రావడం లేదంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)