Breaking News

కొత్త జాబ్‌ ట్రెండ్స్‌.. ప్రయోగాత్మక పని విధానాలు

Published on Sat, 11/15/2025 - 11:10

భారత్‌లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్‌ కోసం వాలువోక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్‌ప్లేస్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2025’ విడుదలైంది.

ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్‌ మెంటారింగ్‌ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్‌ (కెరీర్‌లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్‌షైనింగ్‌ (జాబ్‌ టాస్క్‌ల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్‌ నోమడిజమ్‌ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులను ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు.  

వృద్ధికే ప్రాధాన్యం.. 
వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్‌ ఇండియా ఎండీ శశికుమార్‌ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్‌ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు.

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)