Breaking News

ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్‌ సులువే..

Published on Mon, 08/24/2026 - 08:57

చాలా మంది గృహిణులకు ‘ఫ్రీ టైమ్‌’ అంటే గంటలు.. గంటలు దొరకదు. బోలెడన్ని పనుల మధ్యలో.. కొద్ది కొద్దిగా నిమిషాల రూపంలో దొరుకుతుంది. పొద్దున్నే పనులు.. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్‌ తయారీ.. అటు పైన పిల్లలు స్కూళ్ల నుంచి రావడం..అక్కణ్నుంచి వాళ్లకు ప్రిపరేషన్లు.. వీటిన్నింటి మధ్య అప్పుడప్పుడు కాస్తంత విరామం లభిస్తుంటుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. ఇన్వెస్టింగ్‌ కావచ్చు..ట్రేడింగ్‌ కావొచ్చు.. వీటికి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఇంత హడావుడి మధ్యలో అంతంత సమయం వెచ్చించలేములే అని పక్కన పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. అయితే, నిజం చెప్పాలంటే దీని కోసం గంటలు గంటలు స్క్రీన్‌పై వెచ్చించాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్‌ డిగ్రీ అక్కర్లేదు. మీకు ఆసక్తి ఉండి, ఒక్క అరగంట సేపు ప్రశాంతంగా కాన్సెంట్రేట్‌ చేయగలిగితే స్ట్రెస్‌ ఫ్రీగా మార్కెట్‌ గురించి నేర్చుకోవచ్చు. దీనిపై పట్టు సాధించవచ్చు. ఇందుకోసం సింపుల్‌ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

చిన్నగా ప్రారంభించాలి.. 
ట్రేడింగ్‌ మొదలుపెట్టాలంటే బోలెడంత డబ్బుండాల్సిందే అనే అపోహ ఒకటుంది. నిజానికి అలాంటిదేమీ లేదు. చిన్న చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టొచ్చు. వంద రూపాయలు కావొచ్చు.. వెయ్యి రూపాయల నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని లెర్నింగ్‌ కోసం కేటాయించిన బడ్జెట్‌లాగా భావించాలే తప్ప ఇన్వెస్టింగ్‌ బడ్జెట్‌గా అనుకోవద్దు. ఈ దశలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేర్చుకోవడం. అంతే తప్ప ఎకాయెకిన లాభాలను సాధించేయడం కాదు. ముందుగా యాప్‌ ఎలా పని చేస్తుంది. ఆర్డర్లు ఎలా పెట్టాలి. రేట్లు ఏ రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఇందులోని సాధకబాధకాల గురించి అర్థం చేసుకునేందుకు చిన్న మొత్తాన్ని  కేటాయిస్తేనే మంచిది. అప్పుడే మనస్సూ ప్రశాంతంగా ఉంటుంది. నేర్చుకోవడమూ సులభంగా, సరదాగా ఉంటుంది.

ఫోకస్‌ ముఖ్యం .. మల్టీ టాస్కింగ్‌ వద్దు.. 
మహిళలు సహజంగానే మల్టీటాస్కర్లు. ఏకకాలంలో బోలెడన్ని పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే, ట్రేడింగ్‌ విషయానికొస్తే.. గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. వంట చేస్తూనో, ఇల్లు శుభ్రం చేసుకుంటూనో.. లేదా టీవీ చూస్తూనో.. ట్రేడింగ్‌ను కూడా చుట్టబెట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మిగతా పనుల్లాగా కాకుండా మార్కెట్టు, ట్రేడింగు అంటే ప్రత్యేకంగా దానిపైనే ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది. అది కొద్ది నిమిషాలే కావచ్చు. ఏకాస్త ఫోకస్‌ తప్పినా ... ఏదో పనిలో హడావిడిగా ఉండి.. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా లేదా ఎగ్జిట్‌ అయినా తీవ్ర ఫ్ర్రస్టేషన్‌కి దారి తీయొచ్చు. అందుకే మిగతా ఏ పనులూ లేనప్పుడు, మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఫోకస్‌గా ఉండగలిగినప్పుడు ఒక్క 15–30 నిమిషాల స్లాట్‌ని కేవలం దీని కోసమే కేటాయించాలి. ఒక రకంగా మీకు అత్యంత ఇష్టమైన హాబీ విషయంలో మీరు ఎలా ఉంటారో దీన్ని కూడా అలాగే భావించి, సమయం వెచ్చిం​చాలి. పూర్తి ఫోకస్‌తో ఉండే ఆ కాస్తంత సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఆత్మవిశ్వాసమూ వస్తుంది.

ఫస్ట్‌ ట్రేడ్‌ కోసం బడ్జెట్‌ పెట్టుకోవాలి.. 
ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్‌. ఎప్పుడూ కూడా ఇంటి అవసరాల కోసం ఉద్దేశించిన డబ్బుతో ట్రేడింగ్‌ చేయనే కూడదు. మీరు ట్రేడింగ్‌ మొదలుపెట్టదల్చుకున్నప్పుడు ముందుగానే, దాని గురించి తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు నెలవారీగా ఇంత అని కాస్త మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. అది అయిదు వందల రూపాయలైనా కావచ్చు.. దాన్ని వేరుగానే ఉంచండి. ఇంటి అవసరాల ఖర్చులు, ట్రేడింగ్‌పై ఇన్వెస్ట్‌మెంట్‌ని కలగాపులగం చేయొద్దు. దేనికదే వేరుగా ఉండాలి. సరిహద్దులు స్పష్టంగా ఉండాలి. అప్పుడు ట్రేడింగ్‌ అనేది ఆర్థికంగా ఒక రిస్కీ వ్యవహారంగా కాకుండా వ్యక్తిగతంగా చేపట్టిన ఒక ప్రాజెక్టులాగా అనిపిస్తుంది. ఆందోళనకు ఆస్కారం ఉండదు. నిత్యావసరాలు, ఫీజులు, ఇంటి ఖర్చులు.. ఇలాంటి వాటి కోసం ఉద్దేశించిన డబ్బు జోలికి వెళ్లనే వెళ్లొద్దు.

15 నిమిషాల రొటీన్‌..
రొటీన్‌గా ప్రతిరోజు పాటించే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తుంటాయి. కాబట్టి దీని విషయంలోనూ రోజూ ఒక పదిహేను నిమిషాల సేపు కేటాయించండి. ఒక ఐదు నిమిషాలు బేసిక్‌ ట్యుటోరియల్స్‌ను చూసేందుకు, నేర్చుకునేందుకు కేటాయించండి. ఇంకో ఐదు నిమిషాల పాటు సింపుల్‌ చార్ట్‌ను పరిశీలించండి. మీరు పరిశీలించిన, తెలుసుకున్న విషయాలను మననం చేసుకునేందుకు, రాసిపెట్టుకునేందుకు చివరి ఐదు నిమిషాలను కేటాయించండి. ఇలా వారాల తరబడి, కాస్త కాస్తంతగా తెలుసుకున్న విషయాలతో మార్కెట్‌పై కొంత చెప్పుకోతగ్గ స్థాయిలో అవగాహన వస్తుంది. చూస్తుండగానే మార్కెట్‌ ట్రెండ్స్, క్యాండిల్స్, ఎంట్రీలు, ఎగ్జిట్‌ల విషయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ట్రేడింగ్‌ అనేది ఆందోళన కలిగించేది వ్యవహారంగా ఉండనక్కర్లేదు. ప్రశాంతంగా, మీకు సమయం చిక్కినప్పుడు నెమ్మదిగా నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఉండాలి. భారీగా కాకుండా, చిన్న మొత్తాన్ని కేటాయించి, స్పష్టమైన సరిహద్దులు పెట్టుకుని, ఏకాగ్రతతో నేర్చుకునేందుకు కొద్ది నిమిషాలు కేటాయించగలిగితే.. నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకెళ్తే మార్కెట్‌ గురించి తెలుసుకోవచ్చు. సానుకూల ఫలితాలనే కాకుండా ప్రయాణాన్నీ ఆస్వాదించవచ్చు.

అలర్ట్‌లను ఉపయోగించుకోవాలి..
ట్రేడింగ్‌ తీరుతెన్నులు తెలుసుకోవడం కోసం మీరు గంటలు గంటలు స్క్రీన్‌ ముందే కూర్చుని ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఆధునిక ట్రేడింగ్‌ యాప్స్‌లో చాలా వెసులుబాట్లు ఉంటున్నాయి. మీరు ఆసక్తిగా గమనిస్తున్న షేరు ధర, మీరు అంచనా వేసే స్థాయికి చేరుకున్నప్పుడు తక్షణం నోటిఫై చేసేందుకు వీటిల్లో ప్రైస్‌ అలర్టులు ఉంటున్నాయి. అంటే, మీరు మీ రోజువారీ పనులు చేసుకోవడం కొనసాగిస్తూనే, అలర్టు వచ్చినప్పుడు ఒకసారి యాప్‌ చేసుకుంటే చాలు. దీనివల్ల స్క్రీన్‌ టైమ్‌ తగ్గుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత అవి తప్పయితే చింతించే పరిస్థితి తప్పుతుంది. పైగా ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా స్థిమితంగా నేర్చుకునేందుకు వీలవుతుంది.

సాధారణంగానే మహిళా ఇన్వెస్టర్లు డిసిప్లిన్‌గా ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారు అతిగా ట్రేడింగ్‌ చేయరు. డబ్బు వ్యవహారాల్లో ఎలా తోస్తే అలా నిర్ణయాలు తీసుకోరు. రిసు్కల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వారికన్నా బోలెడంత సహనంతో, నిలకడగా ఉండే వారికే ట్రేడింగ్‌ లాభాలనిస్తుంది. మహిళల్లో సహజసిద్ధంగానే ఈ స్వభావం ఉంటుంది కాబట్టి వారికి అదొక సానుకూలాంశం. ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలను సాధించగలమనే విషయాన్ని విశ్వసించాలి.

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)