Breaking News

రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..

Published on Sat, 06/07/2025 - 16:33

రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్‌ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.

2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్‌ చేసే ముందు అధికారిక సోర్స్‌లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌  ‘ఎక్స్‌’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.

కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..
2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)