మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!
Breaking News
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!
Published on Sat, 07/11/2026 - 07:21
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రభావం.. విద్య, వైద్య, వ్యాపార, సాఫ్ట్‌వేర్ మొదలైన రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అంత్రోఫిక్ సంస్థ సీఈఓ 'డారియో అమోడెయ్' ఏఐ వల్ల ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
డారియో అమోడెయ్ అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో కోడింగ్ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రోగ్రామింగ్‌లో కోడ్ రాయడం, లోపాలను గుర్తించడం, కొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించడం వంటి పనులను ఏఐ చాలా వేగంగా చేస్తోంది. కాబట్టి ముందు కోడింగ్ కనుమరుగవుతుంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై ఎఫెక్ట్
ఏఐ ప్రభావం సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కోడింగ్ తరువాత, ఈ రంగంలో కూడా గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగుల సంఖ్య భారీగా కనుమరుగవుతాయని డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
అయితే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, కొత్త ఉత్పత్తులను డిజైన్ చేయడం, మార్కెట్ అవసరాలను విశ్లేషించడం, ప్రాజెక్టులను నిర్వహించడం వంటి బాధ్యతలు కూడా ఇందులో భాగమే. కాబట్టి ఈ పనుల్లో మానవుల పాత్ర కూడా కొంత అవసరం ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఒక వ్యక్తి మొత్తం పనిలో కేవలం 5 శాతం మాత్రమే పూర్తి చేసినా.. మిగిలిన 95 శాతం పనిని ఏఐ పూర్తి చేయగలదని చెప్పారు. దీంతో ఉత్పాదక పెరుగుతుందని వివరించారు.
ఈ ఉద్యోగాలకు అవకాశం
యువత ఏఐతో పోటీ పడటానికి కావలసిన నైపుణ్యాలను నేర్చుకోవడం కంటే.. ఏఐకి తోడ్పడే నైపుణ్యాలను నేర్చుకుంటే బాగుంటుందని అమోడెయ్ వెల్లడించారు. అయితే.. ఏఐ ఎంత ఎదిగినా సెమీకండక్టర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ వంటి సంప్రదాయ ఇంజినీరింగ్ రంగాలు, అలాగే మానవ సంబంధాలు, నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
ఏఐ వల్ల నైపుణ్యం తగ్గుతుందా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏఐ యుగంలో విమర్శనాత్మక ఆలోచన ముఖ్యమని అమోడెయ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఏఐ నిజమైన చిత్రాలు, వీడియోలు, సమాచారంతో పాటు నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టించగలదు. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధమో గుర్తించే సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన సూచించారు.
అయితే.. విద్యార్థులు ఏఐను ఉపయోగించి హోంవర్క్ లేదా అసైన్‌మెంట్‌లను పూర్తిచేయడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఏఐతో హోంవర్క్ చేయించడం అంటే అది ఒక విధంగా చీటింగ్ చేసినట్లే.. అని ఆయన వ్యాఖ్యానించారు. అంత్రోఫిక్ నిర్వహించిన ఒక పరిశోధనల ప్రకారం, ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ.. సరైన విధంగా ఉపయోగిస్తే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సామర్థ్యాలను పెంచుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
వ్యక్తిగత అభివృద్ధి ఇలా సాధ్యం
ఏఐ వల్ల మనుషులు భవిష్యత్తులో తక్కువ తెలివిగా మారే ప్రమాదం ఉందా అనే ప్రశ్నకు, అది AIను ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన ఆలోచనా శక్తి తగ్గే అవకాశం ఉంది. కానీ దానిని ఒక సాధనంగా ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకుంటే మాత్రం తప్పకుండా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు.
ANTHROPIC CEO: “CODING IS GOING AWAY FIRST, THEN ALL OF SOFTWARE ENGINEERING” pic.twitter.com/4Sjo9LSB4C
— Vivek Sen (@Vivek4real_) July 8, 2026
Tags : 1