Breaking News

ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?

Published on Wed, 06/24/2026 - 11:23

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థానాన్ని కృత్రిమ మేథ (ఏఐ) ఎన్నటికీ ఆక్రమించలేదని ఇన్ఫోసిస్‌ సహ–వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నందన్‌ నీలేకని స్పష్టం చేశారు. ఏఐతో ఐటీ కంపెనీలు మరింత పటిష్టమవుతాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 400 బిలియన్‌ డాలర్ల భారీ ఏఐ ఆధారిత సర్వీసులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇన్ఫీ మరింతగా దృష్టి పెడుతోందని నీలేకని చెప్పారు.

కంపెనీ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సాంకేతిక విప్లవాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న సందేహాలపై నీలేకని స్పందించారు. జెన్‌ఏఐ మనుగడలోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో ఇన్ఫోసిస్‌ మరింత పటిష్టంగా మారిందని, రాబోయే దశాబ్దకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు.  

అత్యుత్తమ కోడింగ్‌ టూల్స్‌ని ఉపయోగించుకుని ఉత్పాదకతను మరింతగా పెంచుకున్నప్పటికీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కి సంబంధించి జీవిత కాలంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయన్నారు. కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌కి కఠినతరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే సైబర్‌సెక్యూరిటీ, కఠినతరమైన డేటా గవర్నెన్స్‌లాంటి వాటిని బైటివాళ్లకి ఔట్‌సోర్సింగ్‌ చేయడానికి ఉండదని పేర్కొన్నారు.

‘పెద్ద కంపెనీల్లో ఏఐ వినియోగానికి సంబంధించి చాలా మటుకు అంతరాలు ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడమే మా పని. ఏఐ అనేది మాలాంటి కంపెనీలను ఆక్రమించదు. పరిస్థితులకు అనుగుణంగా, వేగంగా తమను తాము మల్చుకునే సంస్థలను మరింత పటిష్టం చేస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ టాప్‌ 200 క్లయింట్లలో 90 శాతం సంస్థలకి ఏఐ వినియోగంపరమైన సేవలు అందిస్తున్నట్లు నీలేకని వివరించారు. 

ఇదీ చదవండి: రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్‌ యాప్‌..

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)