Breaking News

యూఎస్‌లో ఈఏడీ ఆటోమెటిక్‌ పొడిగింపు రద్దు

Published on Thu, 10/30/2025 - 10:20

అమెరికాలో వలస కార్మికుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కీలక నిబంధనను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిలిపివేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెరికాలోని ప్రవాస శ్రామిక శక్తిలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులతో సహా వేలాది మంది విదేశీ సిబ్బందిపై, ముఖ్యంగా H-4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించిన ఈ ప్రకటన ప్రభావం అక్టోబర్ 30, 2025 (గురువారం) లేదా ఆ తర్వాత తమ ఈఏడీను రెన్యువల్‌ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే సిబ్బందిపై పడనుంది. ఇకపై స్వయంచాలకంగా(ఆటోమెటిక్‌గా) ఈఏడీ పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. నిర్దిష్ట తేదీకి ముందే దాఖలు చేయబడిన దరఖాస్తుల ఈఏడీని పొడిగించనున్నట్లు చెప్పారు.

ఈఏడీ అంటే..

అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసే పత్రం. దీన్ని సాధారణంగా ఫారం I-766 / EAD కార్డు అంటారు. ఈ కార్డు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం యూఎస్‌లో పనిచేయడానికి ఒక వ్యక్తికి అనుమతి ఉన్నట్లు నిరూపించడానికి ఉపయోగపడుతుంది.

జాతీయ భద్రతే లక్ష్యం

గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని విధానం ప్రకారం సకాలంలో రెన్యువల్‌ దరఖాస్తు చేసుకుని, ఈఏడీ అర్హత కలిగి ఉన్నట్లయితే వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పనిచేయడానికి అనుమతించేవారు. అయితే, కొత్త నిబంధనతో జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరింత తనిఖీలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. అందులో భాగంగానే ఈమేరకు యూఎస్‌ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి స్టార్‌లింక్‌ సర్వీసుల డెమో

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)