Breaking News

ఏపీలో దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఎంతంటే..

Published on Mon, 10/13/2025 - 12:33

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ రూ.109.46గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ కొనుగోళ్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల వారీగా వీటి ధరల్లో ఇంత వ్యత్యాసం ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అధిక ధరలకు ప్రధాన కారణాలుగా ఉన్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల స్వరూపాన్ని కింద చూద్దాం.

రాష్ట్రాల వారీగా ధరల్లో వ్యత్యాసానికి కారణాలు

ముడి చమురు (Crude Oil) కొనుగోలు ధర అంతర్జాతీయ మార్కెట్‌పై, డాలర్‌తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉన్నప్పటికీ తుది వినియోగదారునికి చేరే పెట్రోల్ ధర రాష్ట్రాల వారీగా గణనీయంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (GST) పరిధి నుంచి మినహాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక వ్యాట్‌ విధించడం వల్ల ఇక్కడ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా వ్యాట్‌ అధికంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినా..

కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించలేదు. దీని ఫలితంగా కేంద్రం ఇచ్చిన తగ్గింపు ప్రయోజనం వాహనదారులకు పూర్తి స్థాయిలో అందడంలేదు. చమురు రిఫైనరీల నుంచి పెట్రోల్, డీజిల్ రవాణా చేసే దూరాన్ని బట్టి ఖర్చులు కూడా ధరను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రధాన వ్యత్యాసానికి కారణం రాష్ట్రాల పన్ను విధానాలేనని గుర్తుంచుకోవాలి. డీలర్ల కమిషన్ కూడా తుది ధరలో భాగమే. ఇది రిఫైనరీల నుంచి డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినందుకు గాను చమురు కంపెనీలు చెల్లిస్తాయి.

పన్నుల స్వరూపం

పెట్రోల్ తుది ధరలో దాదాపు 50% నుంచి 60% వరకు పన్నుల రూపంలోనే ఉంటుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు

కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై ఒక నిర్ణీత మొత్తం (Fixed Amount)లో ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం తన ఖజానాకు జమ చేసుకుంటుంది. సెస్ (Cess), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)పేరుతో కూడా కేంద్రం పన్నులను విధిస్తుంది. వీటిలో చాలా వరకు రాష్ట్రాలతో పంచుకోకుండా కేంద్రమే తీసుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు

రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి.  ముఖ్యంగా ఇది డీలర్లకు అమ్మే ధర, కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్‌తో సహా మొత్తం ధరపై విధిస్తారు. దీని కారణంగా ఇంధనం బేస్ ధర పెరిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుంది.

ఈ రోజు లీటరు పెట్రోల్ ధరలు (వివిధ రాష్ట్రాల్లో)..

  • ఆంధ్రప్రదేశ్ రూ.109.46

  • కేరళ రూ.107.49

  • తెలంగాణ    రూ.107.46

  • మధ్యప్రదేశ్ రూ.106.52

  • బీహార్ రూ.105.60

  • పశ్చిమ బెంగాల్ రూ.105.41

  • రాజస్థాన్ రూ.104.72

  • మహారాష్ట్ర     రూ.103.50

  • కర్ణాటక రూ.102.92

  • ఢిల్లీ    రూ.94.77

  • అండమాన్ నికోబార్ దీవులు రూ.82.46

ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)