Breaking News

ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

Published on Wed, 06/11/2025 - 11:02

ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పన్ను నియమాలు పాటించకపోవడాన్ని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. భారత పన్ను అధికారులు అన్ని ఆర్థిక లావాదేవీలపై నిఘాను గణనీయంగా పెంచారు. అద్దె ఆదాయం నుంచి పాత పొదుపు ఖాతాల వరకు అన్ని అంశాలకు సంబంధించి స్క్రీనింగ్‌ చేసి పన్ను నోటీసులు జారీ చేస్తున్నారు.

నోటీసులకు కొన్ని కారణాలు ఇవి..

ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పన్ను దారులను గుర్తిస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐలు ఎలాంటి సందర్భాల్లో పన్ను నోటీసులు అందుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.

నివేదించని అద్దె ఆదాయం: ఇండియాలో ఆస్తిని కలిగి ఉండి దానిపై అద్దెను ఆదాయం ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంటే మాత్రం చట్ట ప్రకారం పన్ను పరిధిలోకి వస్తారు.

పాత పొదుపు ఖాతాలు: పరిమితికి మించి డిపాజిట్లు ఉన్న నిద్రాణమైన ఎన్ఆర్ఓ ఖాతాలుంటే పన్ను అధికారులు పరిశీలిస్తారు.

అధిక విలువ కలిగిన లావాదేవీలు: పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌లు, ఆస్తి అమ్మకాలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తప్పకుండా తెలియజేయాలి. ట్యాక్స్‌ డిక్లరేషన్లను సరిగ్గా దాఖలు చేయకపోతే  చర్యలు తప్పవు.

ఇదీ చదవండి: ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా!

మూలధన లాభాలు: భారతదేశంలో స్థిరాస్తి లేదా ఈక్విటీలను విక్రయించడం.. ఇక్కడి డబ్బును విదేశాలకు బదిలీ చేసినా పన్నులు వర్తిస్తాయి.

వ్యాపార ఆదాయం: దేశీయ ఆధారిత వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఐలు ఆదాయపు పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

విదేశీ ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం: భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్నిసార్లు ఎన్‌ఆర్‌ఐలు తమ మొత్తం ఆదాయాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఇది పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)