Breaking News

ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్

Published on Wed, 06/25/2025 - 12:21

ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఇండియాలో కాకుండా దుబాయ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, తద్వారా రియల్ ఎస్టేట్‌ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్‌గా మారుస్తున్నారని బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ తెలిపారు.

జమువార్‌ తన లింక్డ్‌ఇన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ‘ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. దుబాయ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే సంతోషంగా ఉన్నారు. దుబాయ్‌లో 2-3 ప్రాపర్టీస్ కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయి. కేవలం రికార్డు కోసం నేను సంపన్న వర్గం గురించి మాట్లాడటం లేదు. కష్టపడి, డబ్బు ఆదా చేసి, వారి భవిష్యత్తును సులభతరం చేయడానికి తమ కెరియర్‌లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన సాధారణ జంటల గురించి మాట్లాడుతున్నాను. దుబాయ్‌లో చాలా మంది మధ్యతరగతి భారతీయ జంటలు కొన్నేళ్లుగా పొదుపు చేసి రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. 6–7% అద్దె రాబడులను అందించే ఈ ప్రాపర్టీలను కేవలం 5% వడ్డీ రేటుతో కొనుగోలు చేశారు. ఆదాయ వనరు, పదవీ విరమణ ప్రణాళికలు రెండింటికీ ఉపయోగపడే స్థిరాస్తులను సృష్టించుకుంటున్నారు’ అని చెప్పారు.

భారత్‌లో వడ్డీరేట్లు అధికం

‘అయితే ఇండియాలో వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్.. ఇదీ పరిస్థితి. ఇక్కడి విధానాల ద్వారా చాలా మంది మధ్యతరగతి వారు సాధారణంగా ఒక ఇంటిని మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఈఎంఐలపై 10% వరకు వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. అదీ చాలక అప్పు తీసుకుంటారు. అద్దె రాబడిలో కేవలం 3% వరకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తి మొత్తం ఆదాయం ఈఎంఐలకే వెళుతుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: బూమరాంగ్‌లా బంగారం ధరలు! తులం ఎంతంటే..

ఆదాయ మార్గాలపై దృష్టి

సామాన్య ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈల్డ్‌ జనరేట్‌ చేసే పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతిమంగా సొంతిల్లు కలిగి ఉండడం మాత్రమే కాదు.. ఒత్తిడి లేకుండా జీవించడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రిటైర్ అవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అందుకు ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలంటున్నారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)