Breaking News

పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం మూసివేత

Published on Sat, 07/05/2025 - 16:45

ప్రపంచ టాప్‌ టెక్‌ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్‌లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్‌లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్‌లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్‌ ద్వారా తన ప్రోడక్ట్‌లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.  ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్‌ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్‌  లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్‌లోని తన యూరోపియన్ హబ్‌కు మారుస్తోంది.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురు

అంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్‌డౌన్‌ చేయడం అక్కడి టెక్‌ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. 
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)