Breaking News

భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధం

Published on Mon, 05/19/2025 - 11:03

బంగ్లాదేశ్ నుంచి భూమార్గాల ద్వారా రెడీమేడ్ వస్త్రాల దిగుమతిపై భారత్ ఇటీవల నిషేధం విధించింది. ‘నవా షెవా’, ‘కోల్‌కతా సీపోర్ట్స్‌’ ద్వారా మాత్రమే దిగుమతులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ చర్య భారతదేశ టెక్స్‌టైల్‌ తయారీ రంగానికి ఊతమిస్తుందని, దేశీయ ఉత్పత్తిదారులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారాన్ని సృష్టించగలదని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. స్థానిక తయారీని బలోపేతం చేయడం, విదేశీ కంపెనీలు అనుసరిస్తున్న వాణిజ్య లొసుగులను తగ్గించడం ఈ పాలసీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మార్కెట్ ధరలపై ప్రభావం

స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వల్పకాలిక సరఫరా గొలుసు అంతరాయాలకు దారితీయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. లాజిస్టిక్స్‌లో సర్దుబాట్ల కారణంగా కొన్ని బ్రాండెడ్ వస్త్రాల ధరలు స్వల్పంగా పెరగవచ్చని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని కొన్ని కంపెనీలు తమ వస్త్రాలను బంగ్లాదేశ్‌లోకి ఎగమతి చేసి, అక్కడి నుంచి సుంకం లేకుండా భారతదేశానికి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ చర్యలను కట్టడి చేసేందుకు కూడా భారత్‌ తాజా నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వాణిజ్య సంబంధాలు

భారత్ నుంచి పత్తి, నూలు దిగుమతులపై బంగ్లాదేశ్ ఇటీవల ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిషేధం నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల్లో మారుతున్న వాణిజ్య సంబంధాలను ఈ పరిణామాలు హైలైట్‌ చేస్తున్నాయి. తాజా విధానం భారతీయ వ్యాపారాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)