Breaking News

బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?

Published on Tue, 11/25/2025 - 13:28

బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.

గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలు

  • ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.

  • ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.

  • రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.

  • పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.

  • సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.

బంగారం ధరలు తగ్గడానికి కారణాలు

  • ఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.

  • డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.

  • వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్‌గా తగ్గుతాయి.

  • సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.

  • సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.

''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''

ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)