Breaking News

పసిడికి అమ్మకాల సెగ

Published on Tue, 05/13/2025 - 08:18

న్యూఢిల్లీ: పసిడి ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్‌–పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.3,400 నష్టపోయి రూ.96,550కు దిగొచ్చింది.

ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..

యూఎస్‌–చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడడం బంగారం ధరల పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్‌ కమోడిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కళంత్రి తెలిపారు. వెండి కిలోకి రూ.200 నష్టపోయి రూ.99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్‌లను 30%కి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకు వచ్చింది. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య సంధి కుదరొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.
 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)