Breaking News

దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా!

Published on Sun, 09/24/2023 - 21:11

ప్రపంచంలోని చాలా దేశాలు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నాయి, ఈ క్రమంలో రియల్ ఎస్టేట్‌ రంగంలో మరింత డెవలప్ అయిపోతోంది. నేడు చిన్న చిన్న నగరాల్లో కూడా భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇతరదేశాలతో పోలిస్తే అరబ్ దేశాల్లో ఇది ఒకింత ఎక్కువగా ఉంది. దీనికి కారణమేంటి? కొనుగోలుదారులు ఎందుకు అక్కడే ఆసక్తి చూపుతున్నారనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

దుబాయ్ అనేది అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటి. కావున ఇక్కడ రియల్ ఎస్టేట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ దేశం ప్రముఖ దేశాలకు నడుమ ఉంది. కావున ఎక్కడికి ప్రయాణించాలన్న కావలసిన సదుపాయాలు ఎక్కువగా ఉండటమే.

ఒకప్పటి పాలన మాదిరిగా కాకుండా దుబాయ్‌లో స్వతంత్య్రత బాగా పెరిగింది. దీనితో పాటు భద్రతలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ అనుభవించడానికి చాలామంది బారులు తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ రియ‌ల్ ఎస్టేట్‌ పెరుగుతోంది. 2021లో దుబాయ్ రియ‌ల్ ఎస్టేట్‌లో ఇండియన్స్ సుమారు 900 కోట్ల దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..

బుర్జ్ ఖ‌లీఫాతోపాటు ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్‌ వంటివి దుబాయ్‌ని టూరిస్ట్ హ‌బ్‌గా నిలపడంతో సహాయపడుతున్న గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఫిన్‌టెక్ ఎకోసిస్ట‌మ్ అందుబాటులోకి రావ‌డం వల్ల పారిశ్రామిక వేత్త‌ల చూపు ఇటువైపు తిరిగింది. రానున్న రోజుల్లో దుబాయ్‌ రియ‌ల్ ఎస్టేట్‌ మరింత పెరుగుతుంది అంటే ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)