Breaking News

కారు గాల్లో ఎగిరినా ఇన్వెస్టర్లకు ఎందుకు నచ్చలేదు?

Published on Sat, 10/17/2026 - 07:52

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా రెండో తరం రోడ్‌స్టర్‌ను ఎట్టకేలకు ఆవిష్కరించింది. స్పేస్‌ఎక్స్‌ సాంకేతికతను వినియోగించి గాల్లోకి ఎగిరి, తిరిగి ల్యాండ్‌ అయ్యే సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఈ స్పోర్ట్స్‌ కారు ఉత్పత్తిని 2028లో ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాధారణ వినియోగదారులకు ఈ కారు అందుబాటులోకి వచ్చే కచ్చితమైన తేదీని టెస్లా ప్రకటించలేదు. ఈ ఆవిష్కరణ చేసినా టెస్లా షేరు ధరలో ఉత్సాహం కనిపించలేదు. ఈ ప్రకటన వెలువడిన అనంతరం తొలుత పెరిగిన షేర్లు, తర్వాత మార్కెట్‌ ఒత్తిడితో వెనక్కి తగ్గాయి.

నిపుణుల అంచనా ప్రకారం..

టెస్లా కొత్త రోడ్‌స్టర్‌ ఆవిష్కరణ సాంకేతికంగా సంచలనం సృష్టించినా షేరు ధరపై ప్రభావం మాత్రం పరిమితంగా ఉండటానికి ప్రధాన కారణం.. మార్కెట్‌ ఇప్పుడు టెస్లాను కేవలం కార్ల కంపెనీగా చూడటం లేదు. అక్టోబర్‌ 16న ప్రీమార్కెట్‌లో షేరు 5%కుపైగా పెరిగినా ఆ లాభాలు త్వరగా ఆవిరైపోయి రోజు ముగిసే సమయానికి షేరు 2.1 శాతానికి పడిపోయింది.

ఆదాయంపై పెద్ద ప్రభావం ఉండదు

రోడ్‌స్టర్‌ అధిక ధర, తక్కువ ఉత్పత్తి కలిగిన ‘హాలో’ మోడల్‌. కాబట్టి ఇది టెస్లా అమ్మకాలు, లాభాలను గణనీయంగా పెంచే ఉత్పత్తి కాదు. విశ్లేషకుల దృష్టిలో ఇది ఇంజినీరింగ్‌ సామర్థ్యాన్ని చూపించే ప్రదర్శన మాత్రమే. ఆదాయ వృద్ధికి కీలకం కాదు.

అసలు ప్రశ్న: ఎప్పుడు ఉత్పత్తి?

ప్రదర్శనలో ఎగరడం, గాల్లో తిరగడం వంటి ఆకర్షణీయ ఫీచర్లు చూపించినప్పటికీ ఉత్పత్తి 2028లోనే ప్రారంభమవుతుందని సమాచారం. ముందస్తు బుకింగ్‌లు తీసుకుంటున్నప్పటికీ డెలివరీకి కచ్చితమైన తేదీ హామీ లేదని టెస్లా పేర్కొంది. గతంలో రోడ్‌స్టర్‌ ప్రాజెక్టు పలుమార్లు ఆలస్యం కావడం కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తోంది.

పెట్టుబడిదారుల దృష్టి ఎక్కడంటే..

టెస్లా భవిష్యత్‌ విలువను మార్కెట్‌ ప్రధానంగా ఆటానమస్‌ డ్రైవింగ్‌, రోబోట్యాక్సీలు, ఏఐ, హ్యూమనాయిడ్‌ రోబోటిక్స్‌ వంటి విభాగాల ఆధారంగా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీదైన స్పోర్ట్స్‌ కారు ఆవిష్కరణ కంటే ఆ సాంకేతికతల నుంచి వాణిజ్య ఆదాయం ఎప్పుడు వస్తుందన్నదే కీలకం.

ఏమైందంటే..

టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్‌ పరీక్షా కేంద్రంలో తాజాగా నిన్న నిర్వహించిన ప్రదర్శనలో రోడ్‌స్టర్‌ ప్రత్యేక వ్యవస్థ సాయంతో ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించింది. అనంతరం స్పేస్‌ఎక్స్‌తో అభివృద్ధి చేసిన కోల్డ్‌-గ్యాస్‌ థ్రస్టర్లతో గాల్లోకి లేచి మలపులు తిరిగి సేఫ​్‌గా నేలపై దిగింది. వాహనాన్ని గాల్లోకి ఎత్తడం, మధ్యలో తిప్పడం వంటి విన్యాసాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టెస్లా వివరాల ప్రకారం, థ్రస్ట్‌ వెర్షన్‌ గంటకు 60 మైళ్ల వేగాన్ని ఒక సెకను లోపే అందుకోగలదు. రోడ్‌స్టర్‌ పర్ఫార్మెన్స్‌, థ్రస్ట్‌, రాకెట్‌ వంటి మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. ‘రాకెట్‌’ వెర్షన్‌లో 10 కోల్డ్‌-గ్యాస్‌ థ్రస్టర్లు ఉంటాయి. ఇది ప్రస్తుతం సాధారణ రోడ్డు వినియోగానికి ఉద్దేశించిన మోడల్‌గా కాకుండా ప్రత్యేక కస్టమర్ల కోసం రూపొందించిన వేరియంట్‌గా కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా?

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)