Breaking News

భారత్‌ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు

Published on Wed, 10/22/2025 - 09:40

ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్‌ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్‌ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్‌కు ఏర్పడింది.

చైనా ఆరోపణలు

చైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్‌ వస్తువులపై వివక్ష పూరితంగా ఉ‍న్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది.  అందులో సబ్సిడీలు, కౌంటర్‌వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్‌ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.

భారతదేశం వైఖరి

ఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్‌ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్‌కు ఉంది.

డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియ

డబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్‌ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)