ఒక్కసారిగా యూఎస్‌కు విమాన ఛార్జీలు పెంపు

Published on Sat, 09/20/2025 - 14:57

భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌కు రాకపోకలు సాగించే విమాన సర్వీసుల టికెట్‌ ధరలను ఆయా విమానయాన కంపెనీలు ఉన్నట్టుండి పెంచినట్లు తెలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్‌.. వంటి కంపెనీలు యూఎస్‌ నుంచి హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలు కలిగి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులను వెంటనే అమెరికా రావాలని అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి యూఎస్‌కు సర్వీసులు నడుపుతున్న విమానయాన కంపెనీలు టికెట​్‌ ధరలను పెంచినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి.

యూఎస్‌ వెలుపల ఉ‍న్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలు కలిగిన కంపెనీ ఉద్యోగులను ఆయా సంస్థలు సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరాయి. దాంతో భారత్‌ వంటి దేశాల్లో అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. రేపటిలోపు ట్రంప్‌ విధించిన గడువు ముగుస్తుండడంతో ఉద్యోగులు అత్యవసరంగా యూఎస్‌కు పయణమవుతున్నారు. ఇదే అదనుగా విమానయాన కంపెనీలు టికెట్‌ ఫేర్‌ను పెంచుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్‌ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్‌1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్‌ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.

ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్‌ రావాలి’

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)