ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!

Published on Wed, 10/14/2026 - 10:01

అత్యంత ధనిక వర్గానికి చెందిన (ఆల్ట్రా హై-నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌-యూహెచ్‌ఎన్‌ఐ) కుటుంబాల్లో కోట్లాది రూపాయల సంపద చేతులు మారుతున్నప్పటికీ సంపద నిర్వహణ, పెట్టుబడి నిర్ణయాల విషయంలో పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు మూడింట రెండొంతుల (66 శాతం కంటే ఎక్కువ) ప్రాతిపదికన అత్యధిక నికర ఆస్తులు కలిగిన భర్తలు తమ పెట్టుబడి నిర్ణయాల్లో తమ భార్యలను సంప్రదించడం లేదని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి.

నిర్ణయాధికారం పురుషుల చేతుల్లోనే!

సాధారణంగా కుటుంబ ఆర్థిక విషయాల్లో మహిళలకు పూర్తిస్థాయి భాగస్వామ్యం లభిస్తోందని భావిస్తున్నప్పటికీ యూహెచ్‌ఎన్‌ఐ, హెచ్‌ఎన్‌ఐ విభాగాల్లో రియల్ ఎస్టేట్, ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, ప్రైవేట్ ఈక్విటీ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ వంటి కీలకమైన దీర్ఘకాలిక నిర్ణయాలను భర్తలే సొంతంగా తీసుకుంటున్నారు. ప్రాధాన్యత కలిగిన పెట్టుబడుల కేటాయింపుల్లో రిస్క్ తీసుకునే ధోరణిలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చివరికి భర్తల నిర్ణయాలే ఆమోదం పొందుతున్నాయి.

పోర్ట్‌ఫోలియోపై రిస్క్ ప్రభావం

ఆర్థిక నిపుణులు, వెల్త్ మేనేజర్ల ప్రకారం పురుషులు సాధారణంగా అధిక రిస్క్ కలిగిన ఈక్విటీలు లేదా స్పెక్యులేటివ్ అసెట్స్‌ వైపు మొగ్గు చూపుతారు. అయితే, మహిళలు సంపద సంరక్షణ, క్రమశిక్షణతో కూడిన వైవిధ్యీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పెట్టుబడి ప్రక్రియలో భార్యలను భాగస్వాములను చేయకపోవడం వల్ల ఏదైనా ప్రతికూల మార్కెట్ పరిణామం చోటుచేసుకున్నప్పుడు కుటుంబంలో ఆర్థిక భద్రత, స్థిరత్వానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని మార్కెట్ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరం మారుతున్నా సవాళ్లు తప్పవా?

యువ తరం (మిల్లెనియల్స్‌) కొద్దివరకు తమ భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సుముఖత చూపుతున్నప్పటికీ ఇప్పటికీ మెజారిటీ కుటుంబాల్లో ప్రాథమిక నిర్ణయాధికారిగా భర్తే వ్యవహరిస్తున్నాడు. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తున్న సంస్థలు ఈ ధోరణిని గమనించి ఇద్దరినీ భాగస్వాములను చేస్తూ ఉమ్మడి ప్రణాళికలను రూపొందించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

పరిష్కారం వైపు ప్రయాణం

అకస్మాత్తుగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కుటుంబంలో ఆర్థిక నిర్వహణ లోపించకుండా ఉండాలంటే ప్రారంభం నుంచే పెట్టుబడి నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సంపద సృష్టి ఎంత ముఖ్యమో దాని భద్రత, పారదర్శకమైన నిర్వహణ కూడా అంతే ప్రాధాన్యమైనవని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)