Breaking News

ఎవరీ మేఘన కౌర్‌?.. దేశంలో ఆమెకు ఎందుకంత క్రేజ్‌?

Published on Fri, 05/12/2023 - 09:54

ముంబైకి చెందిన మేఘన కౌర్‌ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘షీ ట్రుబుల్‌మేకర్‌’ బాగా ΄పాపులర్‌ అయింది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, సిందీ భాషలు మాట్లాడే మేఘనకు ప్రయాణాలు చేయడం, బ్యాడ్మింటన్‌ ఆడడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అమెరికన్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ పాటలు వినడం అంటే బోలెడు ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే మేఘన జంతుప్రేమి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ΄పాల్గొంటుంది.



‘క్రియేటర్‌ ఎకనామీ ఊపందుకున్న ఈ సమయంలో మీదైన సొంత శైలి ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేస్తారు?’ అని అడిగితే ‘నా నుంచి ఆడియెన్స్‌ ఏం ఆశిస్తున్నారనే దాని గురించి ఆలోచించడంతో పాటు, నేను ఆడియెన్స్‌లో ఒకరిగా మారి నన్ను నేను విశ్లేషించుకుంటాను.

సబ్జెక్ట్‌ విషయంలో రెలవెంట్‌గా ఉండడం అనేది ముఖ్యమైనది. అందుకే ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్‌ అవుతాను. మారుతున్న ట్రెండ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతాను. సబ్జెక్ట్‌ విషయానికి వస్తే అతి తెలివి ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఆడియెన్స్‌ మనకంటే తెలివైన వాళ్లు’ అంటుంది మేఘన. ఎంతవారికైనా ట్రోలింగ్‌ తప్పదు. సోషల్‌ మీడియా స్టార్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన మేఘన ట్రోలింగ్‌పై ఇలా అంటుంది..

‘నేను ఎమోషన్‌ పర్సన్‌. చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటాను. అలాంటి నేను ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ట్రోలింగ్‌ వల్ల  చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అనిపించింది. అయితే ఆ తరువాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఒక్క హేట్‌ కామెంట్‌ ఉన్నచోట పది ప్రశంసలు కనిపిస్తాయి. మరి ఆ ఒక్క కామెంట్‌ను చూస్తూ బాధ పడడం ఎందుకు! అందుకే ΄పాజిటివ్‌ కామెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడతాను. వాటి ద్వారా శక్తిని గ్రహిస్తాను. సక్సెస్‌ఫుల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా రాణించడానికి మొదట ఉండాల్సింది సహనం. ఆ తరువాతే ఏదైనా!’  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)