Breaking News

మస్క్‌కు బిగ్‌ షాక్‌.. ‘ఎక్స్‌’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా

Published on Wed, 07/09/2025 - 22:08

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టారు.  బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ‘ఎక్స్‌’ (అంతకముందు ట్విటర్‌) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. 

తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్‌’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.

xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్‌) అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్‌ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)