Breaking News

హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌: భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అమృత ఆహూజా పాత్ర ఏంటి?

Published on Thu, 03/23/2023 - 20:24

న్యూఢిల్లీ:యూఎస్‌ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  ట్విటర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌పై వెల్లడించిన రిపోర్ట్‌ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్‌ఇంక్‌ ఏంటి?  సహ వ్యవస్థపాకులతోపాటు  ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఈ కంపెనీ భారతీయ-అమెరికన్  సీఎఫ్‌వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్‌ ఇంకపై హిండెన్‌బర్గ్ గురువారం కీలక రిపోర్ట్‌ను వెల్లడించింది. జాక్‌ డోర్సే జేమ్స్ మెక్‌కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్‌ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లు "మిలియన్ల డాలర్లను స్టాక్‌లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు)

పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్‌ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని,  ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో  జాక్ డోర్సే , జేమ్స్ మెక్‌ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. అలాగే సీఎఫ్‌వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్‌పై కూడా  విమర్శలు గుప్పించింది. 

అమృతా అహుజా ఎవరు?
♦ అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి.
♦ 2019లో బ్లాక్‌లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్‌బిఎన్‌బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి  దిగ్గజాలతో కలిసి పనిచేసింది.
♦ ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
♦ ది వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్‌ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె.
♦ ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.  
♦ "కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్" వంటి  పాపులర్‌ గేమ్‌ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్‌ బ్లిజారే కంపెనీకి  అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్‌ స్టోర్‌   బిజినెస్‌ మోడల్‌నుంచి,ఆన్‌లైన్,  ఆల్వేస్‌​ ఆన్‌ లాంటి  మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో  దుమ్ము రేపేలా సాయపడింది.  
♦  ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కనిపించింది.
♦  భర్త హర్‌ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు.
♦  తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ హైట్స్‌లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్‌లో  సమ్మర్‌ క్యాంప్‌ కౌన్సెలర్

 ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే 

సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)