Breaking News

వ్యభిచార గృహాలతో సంబంధాలు: అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌

Published on Thu, 04/10/2025 - 13:43

క్లీన్ వాటర్ స్టార్టప్ అయిన 'గ్రాడియంట్' సీఈఓ అనురాగ్ బాజ్‌పేయ్ (Anurag Bajpayee)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నత స్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు, బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు వెల్లడించారు.

భారత సంతతికి చెందిన అనురాగ్ బాజ్‌పేయ్ మాత్రమే కాకుండా.. వ్యభిచార గృహాల్లో గడిపిన కేసులో వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు మొదలైనవారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు మహిళలతో గడపడానికి గంటకు 600 డాలర్లు (రూ. 50వేలు కంటే ఎక్కువ) వెచ్చించేవారు. వీరు ఎంచుకునే మహిళలలో ఎక్కువ మంది.. అక్రమ రవాణాకు గురై వ్యభిచార కూపంలో ఇరుక్కున్నవారే అని భావిస్తున్నారు.

వ్యభిచార కుంభకోసం కేసులు తమ బాస్ అరెస్ట్ అవ్వడంతో.. కొందరు ఉద్యోగులు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే గ్రాడియంట్ కంపెనీ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎవరీ అనురాగ్ బాజ్‌పేయ్?
అనురాగ్ బాజ్‌పేయి బోస్టన్‌కు చెందిన గ్రేడియంట్ సంస్థకు సహా వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ కంపెనీ మురుగు నీటిని శుభ్రం చేస్తుంది. భారతదేశంలో జన్మించిన బాజ్‌పేయ్ క్లీన్‌టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో కంపెనీ సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్, డ్రింక్స్ వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తోంది. కంపెనీ మొత్తం 25 కంటే ఎక్కువ దేశాలలో 2500 కంటే ఎక్కువ సౌకర్యాలలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పాఠశాల విద్యను పూర్తి చేసిన బాజ్‌పేయ్ 2006లో మిస్సోరి కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత ఎంఐటీలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు, 2008లో మాస్టర్ ఆఫ్ సైన్స్, 2012లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో PhD పట్టా పొందారు. పరిశోధనల సమయంలో ఈయన పారిశ్రామిక డీశాలినేషన్ & నీటిని శుద్ధి చేయడం వంటి వాటిపై రీసర్చ్ చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)