Breaking News

వాట్సప్‌లో అందరికీ ఉపయోగపడే కొత్త ఫీచర్‌ వచ్చేసింది!

Published on Sun, 02/11/2024 - 09:37

కోల్‌కతా కాళీఘాట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తికి అగంతకుడు ఫోన్‌ చేశాడు. ‘సార్‌.. సార్‌ మీకు కంగ్రాట్స్‌. థ్యాంక్యు..థ్యాంక్యు..ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ఏం లేదు సార్‌ మీరు గతంలో ఓ సంస్థలో పెట్టుబడి పెట్టారు కదా . ఆ సంస్థ దివాళా తీసింది. ఆ విషయం మీ క్కూడా తెలుసు. 

తాజాగా కోర్టు మీ పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వుల తాలుకూ న్యూస్‌ పేపర్లలో, టీవీల్లో కూడా వచ్చింది. కావాలంటే మీరే చూడండి.ఈ విషయం చెప్పాలనే మీకు ఫోన్‌ చేశాను. త్వరలో మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం మీ బ్యాంక్‌ అకౌంట్‌లో జమవుతుంది’ అని ఊరించాడు. కాకపోతే మీ ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ వివరాల్ని చెప్పాల్సి ఉంటుందని కోరారు. 



నమ్మితేనే కదా మోసం చేసేది
దీంతో సదరు వ్యక్తి ముందుగా అగంతకుడికి తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలా? వద్దా? అని కాస్త సంశయించాడు. ఆ తర్వాత.. ఆ ఇస్తే ఏముందిలే మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని మనుసులో అనుకున్నాడు. మొత్తం వివరాల్ని అందించాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. వారం రోజుల తర్వాత సదరు పెట్టుబడి దారుడి అకౌంట్‌ నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ఇదిగో ఈయన 8లక్షలు మోసపోతే గత ఏడాది వాటి విలువ వేల కోట్లకు చేరింది.
 
 

వేల కోట్లకు సైబర్‌ నేరాలు
నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ నివేదిక ప్రకారం..2023 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్‌ వరకు సుమారు రూ.5,574 కోట్ల సైబర్‌ నేరాలు జరిగాయి. 2022లో ఈ మొత్తం రూ.2,296 కోట్లుగా ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేశాయి. 

సైబర్‌ నేరాల నుంచి సంరక్షించేందుకు
ఈ తరుణంలో సైబర్‌ నేరాల నుంచి యూజర్లను సంరక్షించేందుకు ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో టూల్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ల లాక్ స్క్రీన్ నుంచి అనుమానిత ఫోన్‌ నెంబర్లను నేరుగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సప్‌ వెసులుబాటు కల్పిస్తుంది. బ్లాక్‌ చేస్తే వాటి నుంచి మీకు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు రావు. మీరు కావాలనుకుంటే వాట్సప్‌కు రిపోర్ట్ చేయొచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)