Breaking News

అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..

Published on Thu, 05/11/2023 - 22:09

గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్‌షాట్‌లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు.

ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? 

ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను  గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది.

ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్‌” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. 

వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్‌ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా)  +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్‌ల నుంచి వస్తున్నాయి. 

వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు.

ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)