Breaking News

ఒకే స్టేటస్‌ ఇమేజ్‌లో ఆరు ఫొటోలు.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌

Published on Sat, 05/31/2025 - 15:05

మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్‌ స్టేటస్‌ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్‌ తీసుకొచ్చిన అప్‌డేట్‌తో స్టేటస్‌ ఇమేజ్‌లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేసేలా వెసులుబాటు కల్పించింది.

ఈమేరకు మే 30న కొత్త అప్‌డేట్‌ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్‌లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్‌ ద్వారా ఇమేజ్‌లను యాడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం

వినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్‌తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్‌ స్టేటస్‌లో పొందుపరిచేలా లేఅవుట్‌ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్‌లన్నింటినీ ఒకే ఫ్రేమ్‌లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్‌ స్టిక్కర్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)