Breaking News

వాట్సాప్‌లో మెట్రో ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌.. ఈజీగా..!

Published on Wed, 06/19/2024 - 20:41

వాట్సాప్ తన ఏఐ చాట్‌ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్‌కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది. 
ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్‌ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్‌ అందిస్తోంది.

వాట్సప్‌లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..
వాట్సప్‌లో మెట్రో టికెట్ బుకింగ్‌ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో  అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయాణికులు  8624888568 (నాగపూర్‌ మెట్రో), 8341146468 (హైదరాబాద్‌ మెట్రో) నంబర్‌కు  'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్‌బాట్‌ టికెట్ బుకింగ్‌ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందిస్తుంది.

ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.

వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)