Breaking News

ఈ లంబోర్ఘిని కార్లకు ఏమైంది? రేమండ్‌ ఎండీ ఆందోళన

Published on Sun, 02/09/2025 - 13:14

ప్రముఖ లగ్జరీ కార్‌ మేకర్‌ లంబోర్ఘినికి (Lamborghini) చెందిన కార్ల భద్రతా ప్రమాణాల గురించి రేమండ్ (Raymond) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) ఆందోళన వ్యక్తం చేశారు. లంబోర్ఘిని  కారు మంటల్లో చిక్కుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన ఓ పోస్ట్‌కు ఆయన స్పందించారు. లగ్జరీ ఆటోమేకర్ విశ్వసనీయత, పారదర్శకతను ప్రశ్నించిన సింఘానియా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించారు.

"లంబోర్ఘిని కి ఏమైంది? వారు ఏం చేయలేకతున్నారా? ఎందుకు ఇన్ని కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి? కంపెనీ నుండి ఎందుకు వివరణ లేదు? కొనుగోలుదారులు జాగ్రత్త!" అంటూ సింఘానియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌లో రాశారు. లంబోర్ఘిని కార్లు మంటల్లో చిక్కుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో సింఘానియా ఈ విధంగా స్పందించారు. 

గతేడాది డిసెంబర్‌లో ముంబైలోని కోస్టల్ రోడ్‌లో కదులుతున్న లంబోర్ఘిని  లోపల మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 45 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. "ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని  విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి దృష్ట్యా, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. సంభావ్య ప్రమాదాలను కాదు" అని ఆయన అప్పుడు ట్వీట్ చేశారు.

ఇక 2024 అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని ఒక హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లంబోర్ఘిని  రెవెల్టో మంటల్లో చిక్కుకుంది. ఎవరూ గాయపడనప్పటికీ, బ్రాండ్-న్యూ హైబ్రిడ్ సూపర్‌కార్ పూర్తిగా దగ్ధమైంది.  2023 మార్చిలో లాంచ్‌ అయిన లంబోర్ఘిని  రెవెల్టో 1,001 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 6.5-లీటర్ V12 హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విశేష దృష్టిని ఆకర్షించింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)