Breaking News

ఆండ్రాయిడ్ ఫోన్‌ స్పీడ్ తగ్గిందా? ఇదిగో పరిష్కారం!

Published on Mon, 07/10/2023 - 16:12

నేడు ఆండ్రాయిడ్ ఫోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్‌లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా?

  • మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి
  • క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 
  • అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
  • ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు. 

(ఇదీ చదవండి: మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!)

మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్‌కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)