Breaking News

పసిడి డిమాండ్‌కు ధరాఘాతం!

Published on Fri, 08/01/2025 - 02:07

ముంబై: పసిడి ధరలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో డిమాండ్‌ (పరిమాణం పరంగా) తగ్గుముఖం పట్టింది. జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్‌ 134.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్‌ 149.7 టన్నుల కంటే ఇది 10 శాతం తక్కువ. ధరలు రికార్డు స్థాయిలకు చేరడం కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. ధరలు పెరిగిన ఫలితంగా పుత్తడి కొనుగోలుపై భారతీయులు అధికంగా వెచ్చించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.

 విలువ పరంగా పసిడి డిమాండ్‌ రూ.1,21,800 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.93,850 కోట్ల కంటే 30% పెరిగింది. బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్‌ పరిమాణం పరంగా 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమైంది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్‌ 106.5 టన్నులుగా ఉంది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్‌ 20 శాతం పెరిగి రూ.80,150 కోట్లకు చేరింది. ధరలు పెరగడం ఫలితంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, అదనంగా ఖర్చు చేయాల్సి రావడం విలువ పెరిగేందుకు దారితీసింది.   

పెట్టుబడి పరంగా డిమాండ్‌.. 
పెట్టుబడి పరంగా బంగారం డిమాండ్‌ 7 శాతం పెరిగి 46.1 టన్నులుగా జూన్‌ త్రైమాసికంలో నమోదైంది. విలువ పరంగా చూస్తే డిమాండ్‌ 54 శాతం పెరిగి రూ.41,650 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలానికి విలువ పెరిగే సాధనంగా  బంగారాన్ని చూస్తున్నారనడానికి ఇది నిదర్శమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్‌ జైన్‌ తెలిపారు. బంగారం దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 150 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది మరోపక్క, బంగారం రీసైక్లింగ్‌ (పునర్వినియోగపరిచిన) డిమాండ్‌ ఒక శాతం పెరిగి 23.1 టన్నులకు చేరుకుంది.  

6 నెలల్లో 253 టన్నులు..
జూన్‌ త్రైమాసికంలో బంగారం ధరలు ఔన్స్‌కు సగటున 3,280 డాలర్లుగా ఉంటే, 10 గ్రాముల ధర భారత్‌లో రూ.90,307 స్థాయిలో ఉన్నట్టు సచిన్‌ జైన్‌ తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యం కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల్లో (జనవరి–జూన్‌) భారత్‌లో బంగారం డిమాండ్‌ 253 టన్నులుగా ఉండగా, పూర్తి ఏడాదికి 600–700 టన్నుల మధ్య ఉండొచ్చని సచిన్‌జైన్‌ తెలిపారు. ధరల్లో స్థిరత్వం ఏర్పడితే డిమాండ్‌ గరిష్ట స్థాయిలో 700 టన్నులకు చేరుకోవచ్చన్నారు. ధరల పెరుగుదల కొనసాగితే డిమాండ్‌ 600 టన్నులకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు