పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు
రూపాయి, ఇంధన రేట్లపై పశ్చిమాసియా ఎఫెక్ట్
Published on Sat, 03/07/2026 - 04:20
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికలో హెచ్చరించింది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంలాంటి అంశాలు కూడా దీనికి తోడైతే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చని ఫిబ్రవరికి సంబంధించిన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది.
అయితే, క్రూడాయిల్ కోసం దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ భారత్ వద్ద తగినంత స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు తక్కువ స్థాయిలో కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం మొదలైన సానుకూలాంశాలు, పెరిగే చమురు ధరల ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ కల్పించగలవని ఆర్థిక శాఖ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ పటిష్టమైన వృద్ధి బాటలోనే ముందుకు సాగిందని పేర్కొంది.
Tags : 1