మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మరో కొత్త కంపెనీ.. సెబీ నుంచి లైసెన్స్‌

Published on Sat, 07/19/2025 - 16:32

ద వెల్త్‌ కంపెనీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (పాంటోమ్యాథ్‌ గ్రూప్‌ సంస్థ) మ్యూచువల్‌ ఫండ్స్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి ‘ద వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.

సెబీ నుంచి సర్టిఫికేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్‌ అప్‌ విధానాలను తమ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లాభం జూమ్‌

ప్రయివేట్‌ రంగ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)