Breaking News

దేశంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు లేని తొలి జిల్లాగా వయనాడ్‌

Published on Sat, 11/28/2026 - 15:33

పర్యావరణ సున్నిత ప్రాంతమైన కేరళలోని వయనాడ్‌ జిల్లా దేశంలోనే మొట్టమొదటి సంపూర్ణ ఈ-వేస్ట్‌ ఫ్రీ జిల్లాగా చరిత్ర సృష్టించింది. జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన 102.85 మెట్రిక్‌ టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను దశలవారీగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్‌కు తరలించడం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించింది. కల్పెట్టలోని చంద్రగిరి ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

వయనాడ్‌లోని 23 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఈ ఈ-వేస్ట్‌ సేకరణ, రీసైక్లింగ్‌ పనులు విజయవంతంగా సాగాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి పాత ఎలక్ట్రానిక్‌ పరికరాలను తొలగించారు. అనంతరం స్థానిక సంస్థలు, జిల్లా శుచిత్వ మిషన్‌ సమన్వయంతో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హరిత కర్మసేన వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి గృహాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించారు. తొలి విడతలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఇలా సేకరించిన వ్యర్థాలన్నింటినీ ‘క్లీన్‌ కేరళ కంపెనీ’ ద్వారా సురక్షిత రీసైక్లింగ్‌ ప్రక్రియకు తరలించారు.

భూగర్భ జలాల రక్షణే ప్రధాన లక్ష్యం

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్లో ఉండే సీసం, పాదరసం, కాడ్మియం వంటి ప్రమాదకర రసాయనాలు సాధారణ చెత్తలో కలిస్తే నేల, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించి జీవవైవిధ్యాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకే ప్రభుత్వం ఈ ‘నిర్మలం’ (వ్యర్థరహిత కేరళ) ఉద్యమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ-వేస్ట్‌ నిర్మూలన స్ఫూర్తితో వయనాడ్‌లోని పర్యాటక కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రజల క్రియాశీల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ కొనసాగితే వయనాడ్‌ నమూనా యావత్‌ దేశానికే పర్యావరణ దిక్సూచిగా నిలవడం ఖాయం.

ఇదీ చదవండి: డిసెంబర్‌ 1 నుంచి జీఎస్టీ నిబంధనల్లో మార్పులు

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)