నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్‌!

Published on Sat, 08/01/2026 - 09:19

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమవుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ‘బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి’ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటిని వాహనాల వాషింగ్‌కు, తోటపని (గార్డెనింగ్), భవన నిర్మాణాలు, రోడ్ల శుభ్రత, ఫౌంటెన్ల నిర్వహణ వంటి ఇతర అవసరాలకు వాడటంపై పూర్తి నిషేధం విధించింది.

రూ.5,000 ఫైన్

బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చట్టం 1964 లోని సెక్షన్లు 33, 34 ప్రాతిపదికన ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించి తాగునీటిని వ్యాపార లేదా ఇతర అవసరాలకు వాడే వారికి మొదటిసారిగా రూ.5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఉల్లంఘన పునరావృతమైతే రూ.5,000 తో పాటు రోజూ అదనంగా రూ.500 వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మాల్స్, సినిమా హాళ్లు, వినోద కేంద్రాల్లో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే కావేరీ నీటిని వినియోగించడానికి అనుమతి ఉంటుంది.

శుద్ధి చేసిన నీటినే వాడాలి..

వాహనాల కడగడం, తోటపని వంటి ప్రాథమికేతర అవసరాల కోసం కేవలం శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని మాత్రమే వినియోగించాలని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చైర్మన్ సూచించారు. జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే పౌరులు హెల్ప్‌లైన్ నంబర్ 1916 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు.

పడిపోతున్న భూగర్భజలాలు

వర్షభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం వల్ల నగరంలోని వందలాది బోర్‌వెల్స్ ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దాదాపు 1.4 కోట్ల జనాభా కలిగిన ఐటీ కారిడార్‌లో రోజువారీ నీటి అవసరాలకు, సరఫరాకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ క్రమంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నీటి ధరలను కూడా ప్రభుత్వం ఇప్పటికే క్రమబద్ధీకరించింది. ప్రతీ చుక్క నీటినీ బాధ్యతాయుతంగా వాడుకోవాలని పౌరులకు జలమండలి పిలుపునిచ్చింది.

ఇదీ చదవండి: బ్యాంక్‌ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)