Breaking News

94 ఏళ్ల వయసులో రూ.50వేల కోట్ల విరాళం..

Published on Sun, 06/29/2025 - 13:17

విజయవంతమైన గొప్ప ఇన్వెస్టర్, సంపాదనలో తిరుగులేని శక్తి అని బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ గురించి గొప్పగా చెబుతారు. అయితే దాతృత్వంలోనూ తనకు సాటి లేరని చాటుతున్నారు బఫెట్‌. తాజాగా 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారాయన.

ఇప్పుడు 94 ఏళ్ల బఫెట్ మొత్తం 9.43 మిలియన్ల బెర్క్‌షైర్ షేర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. తన దివంగత భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,43,384 షేర్లను ఇచ్చారు. అంతేకాకుండా తన ముగ్గురు పిల్లల నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థలు హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లకు 6,60,366 షేర్లను విరాళంగా ఇచ్చారు.

బఫెట్‌ ఇదివరకే ఇలాంటి భారీ విరాళాలను అందించారు. గత జూన్‌లో 5.3 బిలియన్ డాలర్లు, అంతకు ముందు నవంబర్‌లో 1.14 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ తాజా విరాళం తర్వాత కూడా బఫెట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. విరాళానికి ముందు ఆయన నికర సంపద (అంచనా) 152 బిలియన్ డాలర్. ఫోర్బ్స్ ప్రకారం బఫెట్‌ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ విరాళం తర్వాత ఆరో స్థానానికి తగ్గే అవకాశం ఉంది. విరాళాలు ఇస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ బెర్క్‌షైర్ హాత్వేలో 13.8% వాటాను కలిగి ఉన్నారు. తన వాటాలను విక్రయించే యోచన లేదని బఫెట్‌ ఇదివరకే పేర్కొన్నారు.

వారెన్‌ బఫెట్ 1965 నుండి బెర్క్‌షైర్ హాత్వేకు నాయకత్వం వహిస్తున్నారు. దానిని ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మార్చారు. తెలివైన పెట్టుబడి సలహాలకు ప్రసిద్ది చెందిన బఫెట్ కొటేషన్లలో "అద్భుతమైన ధరతో మామూలు కంపెనీని కొనడం కంటే అద్భుతమైన కంపెనీని మామూలు ధరకు కొనడం గొప్ప" అనే ప్రసిద్ధమైంది. తన సంపద ఎలా వినియోగించాలన్నది కూడా బఫెట్‌ ముందే ప్లాన్‌ చేసుకున్నారు. తాను మరణించిన తర్వాత మిగిలిన సంపదలో 99.5 శాతాన్ని కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు అందేలా గత ఏడాది తన వీలునామాను అప్డేట్ చేశారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)