నీకేంటి నొప్పి.. MP చిన్నిపై కొలికపూడి ఫైర్
Breaking News
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..
Published on Sat, 04/25/2026 - 07:59
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కండోమ్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న మలేషియాకు చెందిన ‘కారెక్స్’ సంస్థ కీలక ప్రకటన చేసింది. ముడి పదార్థాల కొరత, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.
ధరల పెంపునకు కారణాలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 500 కోట్ల (5 బిలియన్ల) కండోమ్‌లను ఉత్పత్తి చేసే కారెక్స్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ‘ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం వల్ల చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కండోమ్ తయారీలో వాడే నైట్రైల్, సింథటిక్ రబ్బర్, సిలికాన్ ఆయిల్, ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం షీట్ వంటి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ సరుకు రవాణా రేట్లు పెరగడంతో పాటు సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది’ అని చెప్పింది.
‘కొన్ని రకాల ముడి పదార్థాల ధరలు ఏకంగా 100 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరల సవరణ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని కారెక్స్ సీఈఓ గోహ్ మియా కియాట్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం..
ప్రపంచ కండోమ్ అవసరాల్లో దాదాపు 20 శాతం వాటాను కారెక్స్ ఒక్కటే భర్తీ చేస్తోంది. ఆసియా, యూరప్ దేశాల నుంచి సేకరించే 100కు పైగా రసాయనాలపై ఈ పరిశ్రమ ఆధారపడి ఉంటుంది. ఒక్క కెమికల్ లేదా ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోయినా మొత్తం ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని గోహ్ హెచ్చరించారు. మలేషియా, థాయ్‌లాండ్‌లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగ కోతలు తప్పవని యాజమాన్యం సంకేతాలిస్తోంది.
ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
Tags : 1