Breaking News

లేఆఫ్స్ సమయంలో వాల్‌మార్ట్‌ వినూత్న వ్యూహం

Published on Mon, 06/08/2026 - 21:08

ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేలో నిర్వహించిన వాల్‌మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్‌లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.

ఉత్పాదకత సాధనంగానే ఏఐ

గత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్‌మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్‌మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.

‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్‌మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్‌మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.

భిన్నాభిప్రాయాలు - ఆందోళనలు

ఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్‌మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Videos

Viral Video: సగం తిన్న యాపిల్ ను జనాల్లోకి విసరిన డీకే శివకుమార్

ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!

స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

రేపు విశాఖలో జగన్ పర్యటన

ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి తగ్గిన..!

ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు

నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్

పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో

చంపేస్తాం.. వైఎస్ఆర్ సీపీ నేతలకు జేసీ బెదిరింపులు

స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల వెనుక కారణం ఇదే?

Photos

+5

కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్‌’ఫుల్‌ ఫోటోస్‌

+5

బాలీవుడ్ బ్యూటీ నేహ కక్కర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)

+5

శారీలో అనసూయ గ్లామర్ చూశారా? (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ప్రియాంక మోహన్‌ స్టన్నింగ్‌ స్టిల్స్‌

+5

టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు

+5

క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?

+5

హైదరాబాద్​: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)