Breaking News

భారత్‌ నుంచి మరిన్ని కొనుగోళ్లు

Published on Wed, 06/25/2025 - 10:03

అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ 2027 నాటికి భారత్‌ నుంచి కొనుగోళ్ల పరిమాణాన్ని ఏటా 10 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు స్థానిక సరఫరాదార్లతో కలిసి క్రియాశీలకంగా పని చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌ వచ్చిన కంపెనీ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ ఈ విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా తమ వాల్‌మార్ట్‌ వృద్ధి కార్యక్రమం కింద శిక్షణ కల్పించిన కొందరు విక్రేతలను ఆయన కలిశారు. తమ ఈ–కామర్స్‌ విభాగం ఫ్లిప్‌కార్ట్, డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పే లాంటి వ్యాపారాల నుంచి కొత్త ఆవిష్కరణలు, మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించడం, విక్రేతలను పెంచుకోవడం తదితర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మెక్‌మిలన్‌ వివరించారు. భారత్‌తో తమకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు

గత దశాబ్ద కాలంలో భారత మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందిందని, వచ్చే దశాబ్ద కాలం కూడా ఇదే జోరు కొనసాగబోతోందని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ వృద్ధి ప్రోగ్రాం కింద ఒక లక్ష పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చేరువ కానున్నట్లు వాల్‌మార్ట్‌ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్‌మార్ట్‌ భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ, మార్కెట్‌ యాక్సెస్‌ విషయంలో సహాయ, సహకారాలు అందిస్తోంది. భారతీయ తయారీదార్లు అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లోని వాల్‌మార్ట్‌ స్టోర్స్‌కి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించేలా 2002లో బెంగళూరులో వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)