Breaking News

రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..

Published on Tue, 11/28/2023 - 08:58

ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. కొందరికి వ్యాపారాలు వారసత్వంగా వస్తే.. మరి కొందరు జీరో నుంచి ప్రారంభమవుతారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు 'దేవిత సరఫ్' (Devita Saraf). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె బిజినెస్ బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1981 జూన్ 25న ముంబైలో జన్మించిన 'దేవిత సరఫ్' క్వీన్ మేరీ స్కూల్‌లో చదివింది, ఆ తరువాత హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే బిజినెస్ మీద పట్టు సాధించిన దేవిత చదువు పూర్తయిన తరువాత కేవలం 24 సంవత్సరాల వయసులోనే.. టీవీలను తయారు చేయడానికి ఒక కంపెనీని ప్రారంభించింది.

దేవిత సరఫ్ తండ్రి రాజ్‌కుమార్ సరఫ్.. జెనిత్ కంప్యూటర్స్ బిజినెస్ ప్రారంభించారు. తండ్రి వ్యాపారంలో చిన్నప్పటి నుంచి సహాయం చేయడం అలవాటు చేసుకున్న దేవితా.. టెక్నాలజీ వ్యాపారంలో కొంత నైపుణ్యం సంపాదించింది. అంతే కాకుండా ఈమె తన అన్నయ్యతో కలిసి ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర సమావేశాలకు వెళ్లడం వల్ల వ్యాపారంలోని చిక్కులను గురించి తెలుసుకుంది.

కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చి.. 'వియు' (VU) గ్రూప్ పేరుతో టీవీలను తయారు చేసే కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాపారం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. నేడు ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 1000 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్

వియు కంపెనీ టీవీలను కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో విక్రయిస్తోంది. అయితే మనదేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీ బ్రాండ్‌గా వియు అవతరించింది. కంపెనీ అభివృద్ధి విశేషమైన కృషి చేసిన దేవితను ఫార్చ్యూన్ ఇండియా (2019) భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ఒకరుగా ప్రకటించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)