Breaking News

ట్రంప్‌ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!

Published on Sun, 04/20/2025 - 11:58

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లోనూ అనిశ్చితి ఆవహించింది. ఈ క్రమంలో స్వీడన్‌కు చెందిన భారీ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కులకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అమెరికాలోని మూడు కర్మాగారాలలో 550 నుంచి 800 మంది కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది.

ఈ తొలగింపులు పెన్సిల్వేనియాలోని మకుంగీలో ఉన్న మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియాలోని డబ్లిన్, మేరీల్యాండ్‌లోని హేగర్‌స్టౌన్‌లో ఉన్న రెండు వోల్వో సైట్‌లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఆటోమోటివ్, భారీ పరికరాల రంగాలను అస్తవ్యస్తం చేసి, తయారీ ఖర్చులను పెంచడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉ఇది చదివారా? ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత

సుంకాలే కారణం..
ఉత్తర అమెరికాలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్న వోల్వో సంస్థ భారీ-డ్యూటీ ట్రక్కులకు మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్‌ వివరించింది.  సరుకు రవాణా రేట్లలో అస్థిరత, సంభావ్య నియంత్రణ మార్పులు, సుంకాల వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రభావం వంటి అనేక కారణాలు ఈ తొలగింపులకు దోహదపడ్డాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిర్ధారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము” ఆ ప్రతినిధి తెలిపారు.

ఇటీవలి నెలల్లో అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడీ సుంకాలు.. ముడి పదార్థాలు, విడి భాగాల ఖర్చులను మరింత పెంచాయి. ఫ్రైట్ డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి వోల్వో వంటి స్థిరమైన వాణిజ్య పరిస్థితులపై ఆధారపడే సంస్థలను మరింత ఒత్తిడికి గురిచేశాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలగింపునకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ప్రభావితమైన కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర సాయాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)